Wednesday, July 16, 2008

నా ఆలోచనలు

1. చెయ్యగలను కదా అని ఏది బడితే అది చేసుకుంటూ పోతే నిజం గా చెయ్యాలనుకున్న వాటికి టైం ఉండదు
2. కొన్ని పనులు మనసుకు కరెక్ట్ అనిపించచ్చు కాని బుర్రకి తప్పనిపించొచ్చు. అలాగే కొన్ని పనులు బుర్రకి కరెక్ట్ అనిపించొచ్చు కాని మనసుకు తప్పనిపించొచ్చు. రెండిటికీ తప్పనిపించినప్పుడు మాత్రం ఆ పని చెయ్యకూడదు.
3. నిద్రలో , ఆహరంలో , ప్రేమలో , ఆవేశంలో, ఇలా జీవితంలో మనిషికి అన్ని విషయాల్లో  సమతుల్యం/balance ముఖ్యం.
4. ఈర్ష్య అసుయాలనే అడ్డు తెరలు వున్నవాడు ఇతరుల్లో మంచి విషయాలని నేర్చుకోలేడు.
5. ప్రయత్నం మానవ ధర్మం ఫలితం దైవ నిర్ణయం
6. మనం మన బాడీకి ఏది మంచి ఫుడ్ అని ఎలా తింటామో
అలాగే మన బ్రెయిన్ కి ఏది మంచిదో అదే చూడాలి /చదవాలి /చెయ్యాలి
7. మన గురించి ఆలోచించని వాళ్ళ కామెంట్స్ మనం పట్టించుకో కూడదు
మన గురించి పట్టించుకునే వాళ్ళు మన గురించి కామెంట్స్ చెయ్యరు
8. అనుకుంటే అందరు మన వల్లే కాదనుకుంటే అయిన వాళ్లు కూడా కాని వాళ్ళే
9. పెళ్ళయ్యే వరకు అందరి వాళ్ళం పెల్లయ్యింతరువాత  కొందరి వాళ్ళం
10. ఏ పనైనా మంచి చెడు అలోన్చిచే చెయ్యాలి
11. జీవించడం ఎలాగో ఎవరూ నేర్పలేరు అది జీవితమే నేర్పిస్తుంది
12. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు, కొన్ని సార్లు ఎన్ని కష్టాలు పడినా కావాలనుకున్నది దొరకదు, కొన్ని సార్లు ఏమి ట్రై చెయ్యక పోఇనా వొళ్లోకి వచ్చి పడుతుంది
13. నా అన్న వాళ్ళు లేని వాడు ఎన్ని కోట్లున్నా దరిద్రుడే .
14. మనిషి  face  ని చూసి మోసపోయే వాడు మనిషి heart లో సత్తా ని చూడలేడు Heart ని చూసిన వాడు face ని పట్టించుకోడు.
15. నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు మోసం చేస్కోకు, నిన్ను నువ్వు తెలుసుకో
16. ఏ పనైనా చేసే ముందు దాని అవసరం , కొన్సెకుఎన్కెస్/పర్యవసానాలు ఆలోచించాలి
17. నీ దృష్టిలో నువ్వు దిగజారి పోయే పనులు ఏమి చేయకుండా, అనుకున్నా వాటికీ
నీ శక్తీ వంచన లేకుండా ప్రయత్నం చేస్తే confidence అదే వస్తుంది
18. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి దానికి ఏదో ఒక solution కనిపిస్తుంది
19. స్వప్నం ఉంటే సరిపోదు, దానిని సాధించుకోవడానికి పట్టుదల ఇంకా ప్లానింగ్ ఉండాలి. ప్రతి రోజు నీ స్వప్నాన్ని protect చేస్కోగల మొండి ఘటం అయ్యుండాలి
20. జీవితం చాల చిన్నది అమూల్యమైనది ఇష్టం లేని పనులతో దాన్ని waste చెయ్యొద్దు.
21. కుటుంబంలో ఆప్యాయతలు, ప్రేమలు మాత్రమే ఉండాలి కాని అహంకారాలు కాదు
22 .  వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పే వాడు మహా జ్ఞాని
23 .  మనుషులేన్డుకో పట్టించుకోని వాళ్ళ వెంట పడతారు, ప్రేమించే వాళ్ళని బాధపెడతారు. పట్టించుకోని వాళ్ళని బాధ పెట్టలేక కాబోలు
24 .  అయితే ఎగబడటం లేకపోతే కలబడటం, మధ్యలో ఉండలేవా ఏంటి?
25 . Discipline  లేకపోతే మనం కోరుకున్న రిజల్ట్స్ రావు, దానితో మన మీద మనకే నమ్మకం తగ్గిపోతుంది అందుకే కాన్ఫిడెన్సు పెంచుకోవాలంటే discipline  అలవాటు చేసుకోవాలి
26 . ద్వేషమున్న మనస్సులో దేవుడెలా ఉంటాడు?
27 . మనకి ఎవరన్న ఇష్టం లేకపోతే వాళ్లకి దూరంగా ఉండటానికి try చేస్తాం కాని మనకి మనమే ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళగలం, ఎలా సంతోషం గా ఉండగలం? అందుకే మనమేం చేసినా మన మనస్సుకు నచ్చే పనులే చెయ్యాలి లేకపోతే మన దృష్టిలో మనమే దిగజారి పోతాం.
28. చెప్పే మాటల్లో ప్రాస ఉంటె సరిపోదు అర్ధం ఉండాలి
29 . నా చేతుల్లో ఉన్నదానికి నేనున్నాను, నా చేతుల్లో లేని దానికి ఆ దేవుడున్నాడు ఇంకా భయం దేనికి
౩౦. అందం అనేది temporary , కాని టాలెంట్ చచ్చేవరకు తోడు ఉంటుంది
31. అందరం బ్రతుకుతున్నాం కాని జీవించడం కొద్ది మందె చేస్తున్నారు
32. నువ్వు నా ప్రేమని కాదంటే తెమ్పోరరీ గా బాధపదతానేమో కాని నీకు నా ప్రేమని చెప్పకపోతే మాత్రం జీవితాంతం బాధపడతాను
33. నిదరేక్కువ పోతే కళలు ఎక్కవుస్థాయి కాని నీ నిజమైన కలలని నిజం చేసుకోవడానికి టైం తగ్గిపోతుంది
34. పది మంది మెచ్చేటట్టు కాదు మనసుకి నచ్చేటట్టు ఉండాలి
35. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించటం
36. మాటల్లో డెప్త్ ఉండాలి , లెంగ్త్ కాదు